ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబరు 1వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్ గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైన రోజది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు. 2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సంప్రదాయంగా వస్తున్న అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికి, జూన్ 2న నవ నిర్మాణ దీక్షల పేరుతో కొట్ల రూపాయల ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేసింది. ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి పూర్వపు ఆంధ్రరాష్ట్ర అవతరణ అయిన అక్టోబర్ 1న జరుపుకోవాలనే ఒక వాదన ఉన్నప్పటికినీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని ప్రస్తుత వై యస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి పాత సాంప్రదాయాన్నే పాటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా మారుతుందని ఎక్కువ మంది అభిప్రాయం.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
Start Time
12:00 am
October 29, 2022
Finish Time
12:00 am
October 30, 2022
Event Participants
Col(Dr) Shivji Misra(Retd)
CHAIRMAN
Dheeraja
VICE CHAIRMAN
M. Meenakshi Naidu
CORRESPONDENT
Jonna Veeraseshaiah
PRINCIPAL